ప్రస్తుతం సినిమాల్లో ముద్దు సన్నివేశాలు ఎక్కువైపోయాయి. అదర చుంబనాలతో సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు నటీనటులు. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంటే ఒకప్పుడు ముద్దుల మాటేంటి. కొంత కాలం క్రితం వరకూ ముద్దంటే అమ్మో వద్దంటూ కథానాయికలు దూరం జరిగేవారు. పోనీ వారు ధైర్యం చేసినా సెన్సార్ పెద్దలు సంస్కారం అనే కత్తెరతో కత్తిరించి పడేసేవారు. ఆ గోలంతా ఎందుకని నాయకానాయికలు పూల మొక్కల వెనుకకు వెళ్లినట్టు, కాసేపటికి కొమ్మలు అటు ఇటు కదిలినట్లు చూపించి దర్శకులు భలే గమ్మత్తుగా ముద్దులను చూపించేవారు.. కాదు దాచేసేవారు.
తొలి ముద్దు సన్నివేశం తెరకెక్కిందప్పుడే..! - karma
90 ఏళ్ల క్రితమే భారతీయ సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు బీజం పడింది. 1929లో వచ్చిన మూకీ చిత్రం 'ఏ థ్రో ఆఫ్ డైస్' తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది.
భారతీయ తెరపై అదర చుంబనానికి నాంది పడింది ఎప్పుడో తెలుసా? 90 ఏళ్ల క్రితమే. 1929లో వచ్చిన మూకీ చిత్రం 'ఏ థ్రో ఆఫ్ డైస్' తొలిసారిగా ముద్దు సన్నివేశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. మహాభారతం ఆధారంగా కల్పిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో సీతా దేవి, చారు రాయ్ అనే నటీనటులు ఒక్క క్షణం పాటు అలా పెదాలు కలుపుతారు. అయితే ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చిన తొలి ముద్దు సన్నివేశం 1930లో వచ్చిన 'కర్మ'లోది. నిజ జీవితంలో భార్యాభర్తలైన ప్రముఖ నటి దేవికా రాణి, హిమాన్షు రాయ్ అందులో నాయకానాయికలుగా నటించారు. ఓ సన్నివేశంలో నాలుగు నిమిషాల పాటు ముద్దుతో మురిపించారు.
ఇవీ చూడండి.. ఓ బేబీ చిత్రంలో ఈ సాంగ్ విన్నారా..!