తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'తేరే బినా..'లో సల్మాన్​ కుమార్తె ఎవరో తెలుసా? - జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ ఖాన్​, జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ జంటగా నటించిన రొమాంటిక్​ సాంగ్​ 'తేరే బినా..' ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో విడుదలైంది. ఈ పాటకు విశేష స్పందన లభించిన క్రమంలో అందులో నటించిన చిన్న పాప ఎవరని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు.

Find out who is Salman Khan's daughter in Tere Bina
'తేరే బినా..'లో సల్మాన్​ కూతురు తెలుసా?

By

Published : May 13, 2020, 10:24 AM IST

'తేరే బినా..' రొమాంటిక్​ సాంగ్​లో సల్మాన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌తో పాటు ఓ చిన్నపాప నటించింది. పాటలో సల్మాన్​, జాక్వెలిన్​ కూతురుగా నటించి వీక్షకులను కట్టి పడేసింది. అయితే ఈ పాప ఎవరని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. చివరికి ఆ చిన్నారి ప్రముఖ నటి వాలూచా డి సౌసా కుమార్తె సియాన్న అని తెలిసింది. తన నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

అదంతా భ్రమని చివర్లో తెలిసింది

''తేరే బినా..' పాటను పాడింది, రూపొందించింది, షూట్‌ చేసింది నేనే. మీ కోసం పోస్ట్‌ చేశా. మీరూ వినండి, చూడండి. మీ వెర్షన్‌లో షూట్‌ చేసి, నాకు ట్యాగ్‌ చేయండి.." అని సల్మాన్‌ ఈ సందర్భంగా పోస్ట్‌ చేశారు. సల్మాన్‌, జాక్వెలిన్‌ ప్రేమ ప్రయాణాన్ని ఇందులో చూపించారు. ఇద్దరు కలిసి బైక్‌పై షికార్లు చేస్తూ.. ఈత కొడుతూ.. సమయం గడిపారు. అయితే అదంతా సల్మాన్ భ్రమని చివర్లో తెలుస్తుంది. ఈ పాటకు అజయ్‌ భాటియా సంగీతం అందించారు. షబ్బిర్‌ అహ్మద్‌ సాహిత్యం అందించారు.

టైమ్​పాస్​ కోసమే..

"మేం ఫాంహౌస్‌కు వచ్చి ఏడు వారాలవుతోంది. లాక్‌డౌన్‌ వల్ల ఇన్ని రోజులు ఇక్కడ ఉంటామని ఊహించలేదు. అందుకే మమ్మల్ని మేం బిజీగా ఉంచుకోవడానికి ఏదైనా చేయాలి అనుకున్నాం. పాటలు రూపొందించాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటికే 'ప్యార్‌ కరోనా..' మీరు చూశారు. ఇప్పుడు 'తేరే బినా..' విడుదల చేశాం" అని ఈ సందర్భంగా సల్మాన్‌ ఖాన్‌ అన్నారు.

ఇదీ చూడండి.. సంక్రాంతి బరిలో సూపర్​స్టార్- అజిత్​తో తలైవా ఢీ​!

ABOUT THE AUTHOR

...view details