తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రముఖ దర్శకురాలికి కరోనా.. రెెండు డోసులు తీసుకున్నా!

ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్​ ఫరా ఖాన్(farah khan movies) ​ కరోనా బారిన పడ్డారు. రెండు డోసులు తీసుకున్నప్పటికీ వైరస్​ సోకడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేయించుకోవాలని సూచించారు.

farah khan
ఫరాఖాన్​

By

Published : Sep 1, 2021, 9:23 PM IST

Updated : Sep 1, 2021, 9:32 PM IST

దేశంలో కొద్దికాలంగా కరోనా వ్యాప్తి స్థిరంగా ఉంది. వ్యాక్సినేషన్​ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ క్రమంలోనే అన్ని రంగాల వారు టీకాలు తీసుకుని తమ పని తాము చేసుకుంటున్నారు. చిత్రసీమ కూడా షూటింగ్​లతో బిజీగా గడుపుతోంది.

ఈ క్రమంలో తాను కరోనా బారిన పడ్డానంటూ ప్రముఖ దర్శకురాలు, కొరియోగ్రాఫర్​ ఫరా ఖాన్(farah khan movies)​​ సోషల్​మీడియాలో పోస్ట్​ చేశారు. తాను రెండు డోసులు వేయించుకుని, రెండు టీకాలు తీసుకున్నవారితోనే పనిచేస్తున్నప్పటికీ వైరస్​ సోకడం ఆశ్చర్యమేసిందని వెల్లడించారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టు చేయించుకోవాలని సూచించారు. త్వరలోనే కోలుకుంటానని చెప్పారు.

కరోనా సోకకముందు ఫరా ఖాన్​.. ప్రముఖ 'జీ కామెడీ షో' షూటింగ్​లో పాల్గొన్నారు. దీంతోపాటు ఇటీవల 'కౌన్​ బనేగా కరోడ్​​పతి' 13వ సీజన్ కోసం హీరోయిన్​ దీపికా పదుకొణెతో షూటింగ్​లో పాల్గొన్నారు. 'సూపర్​ డ్యాన్స్​ర్​ 4'కు అతిథిగానూ విచ్చేశారు.

ఇదీ చూడండి: Tuck Jagadish: అలరిస్తున్న 'టక్‌ జగదీష్‌' ట్రైలర్‌

Last Updated : Sep 1, 2021, 9:32 PM IST

ABOUT THE AUTHOR

...view details