తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వీరు వయసులోనే కాదు.. ఫిట్​నెస్​లోనూ సీనియర్లే! - ఫిట్​నెస్​

'మా అభిమాన హీరో కండలు మెలితిరిగిన వీరుడు' అని గర్వంగా చెప్పుకుంటూ ఆనందపడుతుంటారు కొందరు సినీ ప్రేమికులు. కానీ, వయసు మళ్లిన బాలీవుడ్​ నటుల్లోనూ ఫిట్​నెస్​ వీరులున్నారు. 60 ఏళ్లకు పైబడినా.. వారి ఫిటినెస్​ను కాపాడుకుంటూ ఆరోగ్యం కోసం ఏమైనా చేస్తామని అంటున్నారు. వారెవరో చూద్దాం.

FITNESS_STAR ACTORS
ఈ నటులు వయసులోనే కాదు ...ఫిట్​నెస్​లోనూ సీనియర్లే!

By

Published : Oct 26, 2020, 11:54 AM IST

జాకీ ష్రాఫ్ నుంచి అనిల్​ కపూర్​ వరకు మొత్తంగా ఏడుగురు బాలీవుడ్​ నటులు తమ ఫిట్​నెస్​ విషయంలో ఎక్కడా తీసిపోరు. తమదైన శైలిలో తరచు వ్యాయామం చేస్తూ ఫిట్​నెస్​ను కాపాడుకుంటున్నారు. వయసు కేవలం అంకె మాత్రమే అని రుజువు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా వీళ్లు ఇంత ఫిట్​గా ఎలా ఉన్నారో తెలుసుకుందాం..

1. అనిల్​ కపూర్

షర్టు లేకుండా బీచ్​లో నడుస్తూ ఓ ఫోటో దిగి ఇటీవలె తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నారు నటుడు అనిల్​ కపూర్. 'ఈ వ్యక్తి ప్రవచనాలు చెప్పడు. కేవలం తన షర్టు విప్పేసి బీచ్​లో అలా సరదాగా నడుస్తూ ఉంటాడు ' అని తన ఫిట్​నెస్​ కనబడేలా పెట్టిన ఫోటోకి ఈ కామెంట్ జోడించారు.

63 ఏళ్ల వయసులోనూ అనిల్​ కపూర్​ ఇంత ఫిట్​గా కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. తను రోజూ రన్నింగ్​, సైక్లింగ్, జంపింగ్ రోప్స్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ సరదాగా తన అభిమానులకూ ఫిట్​నెస్ ఛాలెంజ్​లు విసురుతుంటారు.

అనిల్​ కపూర్

2. రజనీకాంత్

'ఇన్ టూ ది వైల్డ్​ విత్ బియర్​ గ్రిల్స్' షూటింగ్​ సమయంలో రజనీకాంత్​ తన ఫిట్​నెస్​ ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 69 ఏళ్ల వయసున్నా కర్ణాటకలోని బందీపూర్​ టైగర్​ రిజర్వ్​లో బియర్​ గ్రిల్స్​తో కలిసి ఉల్లాసంగా షూటింగ్​లో పాల్గొన్నారు. గతేడాది 'దర్బార్'​ షూటింగ్​ సమయంలో కండలు చూపిస్తూ అలరించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో నటించిన సమయంలో రజనీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. ఫిట్​నెస్​ వర్కౌట్స్​ మాత్రమే కాక రజనీ యోగా, స్విమ్మింగ్​ కూడా చేస్తారు.

రజనీకాంత్

3. సన్నీ దేఓల్

'ఫిట్​నెస్​ అనేది ఒక వ్యసనం. కనీసం రోజుకు రెండు మూడు గంటలైనా వ్యాయామం చేయకపోతే రోజు గడవదు. పొద్దున జిమ్​లో గడిపి, మధ్యాహ్నం ఆటలు ఆడుతుంటా ' అని చెబుతున్నారు ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సన్నీ దేఓల్. 'దాయ్​ కిలో కా హాత్' అనే చిత్రంతో ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు సన్నీ. ఇటీవలె సన్నీ తన 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.

సన్నీ దేఓల్

4. అమితాబ్​ బచ్చన్

చాలా సినిమాల్లో నటించడమే కాకుండా 'కౌన్​ బనేగా కరోడ్​పతి' కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన అమితాబ్​ బచ్చన్ సూపర్​ ఫిట్​ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 78 ఏళ్ల వయసులోనూ జిమ్​లో వర్కౌట్స్​ చేస్తూ ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేశారు అమితాబ్. తన సొంత బ్లాగ్​ పోస్ట్​లోనూ అమితాబ్​ జిమ్​తో రోజును ప్రారంభించాలని, యోగా చేయాలని, ప్రాణాయామం​ చాలా అవసరమని పేర్కొన్నారు.

అమితాబ్​ బచ్చన్

5. అనుపమ్ ఖేర్

బాక్సింగ్​, వెయిట్​ లిఫ్టింగ్​, పుష్​ అప్స్ చేస్తూ లాక్​డౌన్​లో ఫిట్​నెస్​ చిట్కాలు చెప్పారు నటుడు అనుపమ్ ఖేర్. 65 ఏళ్ల అనుపమ్​ తను ఫిట్​గా ఉండేలా ప్రోత్సహించే అక్షయ్​ కుమార్, సల్మాన్​ ఖాన్, అనిల్​ కపూర్​ కు ధన్యావాదాలు తెలిపారు. 2016లో ఒకేసారి 14 కిలోలు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచాడు అనుపమ్.

అనుపమ్​ ఖేర్

6. జాకీ ష్రాఫ్

కండల వీరుడిగా టైగర్​ ష్రాఫ్​ అందరికీ సుపరిచితుడే. కానీ, 63 ఏళ్లున్న అతడి తండ్రి జాకీ ష్రాఫ్​ కూడా సూపర్​ ఫిట్​నెస్​తో ఉంటారు. ఇటీవలె తన కండలు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో షేర్ చేశారు. నెలకు కనీసం 15 రోజులైనా వ్యాయమంతోపాటు యోగా చేస్తారు. ప్రస్తుతం, అక్షయ్​ కుమార్​ నటిస్తోన్న 'సూర్యవంశీ' సినిమాలో ష్రాఫ్ నటిస్తున్నారు.

జాకీ ష్పాఫ్

7. పునీత్ ఇస్సార్

బీఆర్​ చోప్రా తీసిన మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషించిన పునీత్​ ఇస్సార్ చాలా ఫిట్​గా ఉంటారు. ఇస్సార్ వయసు 60 ఏళ్లు. లాక్​డౌన్​ కాలంలో తన గ్యారేజ్​ను జిమ్​లా మార్చి ఫిట్​నెస్​పై ఫోకస్​ చేశారు. ఈ జిమ్​ను ఐరన్​ ప్యారడైజ్​ పిలుస్తుంటాడరు. తరచుగా స్విమ్మింగ్, సూర్య నమస్కారాలు, వెయిట్​ లిఫ్టింగ్ చేస్తుంటారు.

పునీత్ ఇస్సార్

ఇదీ చదవండి:'హైపర్ ఆది'కి ఆ పేరెలా వచ్చిందంటే?

ABOUT THE AUTHOR

...view details