తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండ పేరుతో మోసం! - టాలీవుడ్ సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ పేరు ఉపయోగించుకుని కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాయని ఈ కథానాయకుడి బృందం పేర్కొంది. ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని తెలిపింది.

విజయ్ దేవరకొండ పేరుతో మోసం!
విజయ్ దేవరకొండ పేరుతో మోసం!

By

Published : Sep 13, 2020, 4:34 PM IST

కొన్ని నిర్మాణ సంస్థలు విజయ్‌ దేవరకొండ పేరు ఉపయోగించుకుని తప్పుడు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నాయని కథానాయకుడి బృందం పేర్కొంది. అలాంటి వారిని నమ్మొద్దని.. విజయ్‌ సినిమా అప్‌డేట్స్‌ అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది. విజయ్‌ సోషల్‌మీడియా ఖాతా ద్వారా వాటిని ధ్రువీకరిస్తారని చెప్పింది.

"విజయ్‌ దేవరకొండతో సినిమా తీయబోతున్నామంటూ కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఆయన సినిమాకు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నామంటూ నటీనటులను సంప్రదిస్తున్నాయి. విజయ్‌ నటించబోతున్న ఏ ప్రాజెక్టైనా సరే నిర్మాతలు అధికారికంగా నేరుగా ప్రకటిస్తారు. అలాంటి సమాచారం ఉంటే విజయ్‌ తన అధికారిక సోషల్‌మీడియా ఖాతాల ద్వారా నిర్ధారిస్తారు. మేం సదరు నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోబోతున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమాచారాన్ని ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవాలని కోరుతున్నాం. ధన్యవాదాలు."

-విజయ్‌ దేవరకొండ టీమ్

‘'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' తర్వాత విజయ్‌ 'ఫైటర్‌' (పరిశీలనలో ఉంది) సినిమాలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో అనన్య పాండే కథానాయిక. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొంత భాగం షూటింగ్‌ పూర్తయింది. లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ నిలిచిపోయింది.

ABOUT THE AUTHOR

...view details