తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హే బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ...? - farhan

భోపాల్​లో సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ట్వీట్​ చేసిన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. అందుకు కారణం అక్కడ మే 12న ఎన్నికలు జరగగా ఇవాళ ఫర్హాన్​ ట్వీట్​ చేయడమే.

ఫర్హాన్

By

Published : May 19, 2019, 4:43 PM IST

సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​పై ట్రోల్స్​ పోటెత్తుతున్నాయి. వాస్తవంలోకి రమ్మంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్​ లోక్​సభ ఎన్నికల్లో సరైన వ్యక్తికే ఓటేయాలని ఈ ఉదయం ఫర్హాన్​ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. గాంధీని హత్య చేసిన గాడ్సేను కీర్తిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్​ ఠాకుర్​కు ఓటు వేయొద్దని సూచిస్తూ ఈ ట్వీట్​ చేశాడు ఫర్హాన్​.

"ప్రియమైన భోపాల్ ఓటర్లులారా... మీ నగరాన్ని మరో గ్యాస్​ ఉదంతం నుంచి రక్షించుకోవాల్సిన సమయమిది. సరైన వ్యక్తికే ఓటేయండి" -పర్హాన్ అక్తర్, బాలీవుడ్ నటుడు

నిజానికి భోపాల్​ నియోజకవర్గానికి ఎన్నికలు మే 12నే అయిపోయాయి. ఈ బాలీవుడ్ నటుడు మాత్రం మే 19న ట్వీట్ చేయగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో చురకలు అంటిస్తున్నారు. పెళ్లైన తర్వాత ప్రియురాలు రిప్లై ఇచ్చినట్టుందని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

"భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని ఈ అంశానికి జోడించడం సిగ్గు చేటు అంటూ" మరొకరు ట్వీటారు.

"ఫర్హాన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ రీచార్జ్​ చేసుకోండి. మీ ట్వీట్లు పోస్ట్​ కావడానికి 8 రోజులు పడుతోంది" అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

ఈ ట్రోల్స్​పై ఫర్హాన్ స్పందించాడు. "తేదీని తప్పుగా అర్ధం చేసుకున్నా, దొరికిపోయా.. చరిత్రను తప్పుగా అర్థం చేసుకున్న వారికే మీరు హగ్ ఇవ్వండి" అంటూ మరో ట్వీట్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details