తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆమె చేయిస్తే.. అతడు ముద్దు పెట్టబోయాడు! - Sara Ali Khan pilates

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్​ చేయిపై ఓ అభిమాని ముద్దుపెట్టుకోబోయాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆమె చేయిస్తే.. అతడు ముద్దు పెట్టబోయాడు!
హీరోయిన్ సారా అలీ ఖాన్

By

Published : Jan 10, 2020, 12:20 PM IST

ఓ అభిమాని చూపించిన అత్యుత్సాహంతో బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ షాక్‌కు గురైంది. 'కేదరనాథ్‌' చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. సారా అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రేమగా 'యువరాణి' అని పిలుస్తుంటారు. తాజాగా ఈ చిన్నది జిమ్‌ నుంచి బయటకు వస్తుండగా ఆమెను ఫొటోలకు పోజులివ్వమని అభిమానులు కోరారు. అక్కడ ఉన్నవాళ్లందరినీ పలకరించి.. ఫొటోలకు పోజులిచ్చింది సారా. అయితే ఓ అభిమాని చేసిన పనికి, ఆమె అవాక్కయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?

ఓ అభిమాని సారాను కరచాలనం చేయమని కోరగా.. ఆమె వెంటనే చేయి అందించారు. అభిమాని షేక్ హ్యాండ్​ ఇచ్చి, వెంటనే ఆమె చేతిపై ముద్దుపెట్టుకోబోయాడు. ఈ చర్యతో సారా ఒక్కసారిగా షాకైంది. ఆమె బాడీగార్డ్స్‌ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సారా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్​గా మారింది.

ఈ వీడియాపై నెటిజన్లు.. 'సారా మీ అందానికి చాలా మంది ఫిదా అయిపోతున్నారు. కాబట్టి మీరు వెంటనే సెక్యూరిటీని పెంచుకోండి', 'సారా చాలా వినయంగా ప్రవర్తించి అతనికి చేయి అందిస్తే.. అతను మాత్రం ఇలా ప్రవర్తించడం ఏం బాలేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇటీవల న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా మాల్దీవుల టూర్‌కు వెళ్లిన సారా.. అక్కడ దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో పెట్టి నెటిజన్లను ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details