తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అభిమాని సాహసానికి 'సోనూ' కంటతడి

నటుడు సోనూసూద్​ను కలిసేందుకు ఓ అభిమాని పెద్ద సాహసమే చేశాడు. బిహార్​ నుంచి ముంబయికి ఏకంగా సైకిల్​ మీద బయలుదేరాడు. ​ఈ విషయం తెలుసుకున్న సోనూ కంటతడి పెట్టుకున్నారు. సదరు అభిమానిని విమానంలో వచ్చేలా ఏర్పాట్లు చేస్తానని ఆయన తెలిపారు.

sonu
సోనూ

By

Published : Nov 25, 2020, 6:39 PM IST

కరోనా క్లిష్టకాలంలో నిస్సహాయులకు అండగా నిలిచి రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ను కలిసేందుకు అర్మాన్‌ అనే అభిమాని పెద్ద సాహసమే చేశాడు. సైకిల్‌పై బిహార్‌ నుంచి ముంబయికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ భావోద్వేగానికి గురయ్యారు. అభిమాని చూపిస్తున్న ప్రేమకు కంటతడి పెట్టుకున్న ఆయన.. అతడికి సాయం చేయడం కోసం సన్నాహాలు చేశారు. మార్గ మధ్యంలో అతడితో సంప్రదింపులు జరిపి.. విమానంలో ముంబయికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని సోనూనే స్వయంగా చెప్పారు.

"నేను అర్మాన్‌తో మాట్లాడాను. అతడు వారణాసి చేరుకున్నాడు. సైకిల్‌పై బిహార్‌ నుంచి రావడం మంచిది కాదని చెప్పా. విమానంలో ముంబయికి వచ్చేలా ఒప్పించాను. అతడి రాకపోకలకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. అర్మాన్‌కు నేనంత ప్రత్యేకమైనప్పుడు.. అతడి రాకను నేను ఇంకా ప్రత్యేకం చేస్తా. సైకిల్‌ కూడా విమానంలో వస్తోంది, వెళ్లేటప్పుడు కూడా దాన్ని తిరిగి పంపిస్తా. ఓ సారి నన్ను బిహార్‌ రమ్మని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. దానికి కాస్త సమయం పడుతుంది."

-సోనూసూద్, ప్రముఖ నటుడు.

కష్టకాలంలో సోషల్‌ మీడియా ద్వారా పేదలను ఆదుకున్నవారిలో సోనూ టాప్​లో నిలిచారు. మొత్తంగా అన్ని విభాగాలు కలిపి ఓ అనలైటికల్‌ సంస్థ అక్టోబర్‌కు సంబంధించి ప్రకటించిన నివేదికలో.. నాలుగో స్థానంలో నిలిచారు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, సినిమాలు ఇలా వివిధ రంగాల్లో కలిపి టాప్‌ సెలిబ్రిటీస్‌ ఎవరని శోధించగా.. సోనూ అందులో చోటు దక్కించుకున్నారు. అగ్రస్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్‌ గాంధీ, మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉండగా.. 2.4 మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్‌ ఉన్నారు.

ఇదీ చూడండి : ఈనాడు కథనానికి సోనూసూద్ స్పందన.. సాయం చేస్తానని హామీ...

ABOUT THE AUTHOR

...view details