తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాంగ్రెస్​కు ప్రముఖ నటి ఊర్మిళ రాజీనామా - ఊర్మిళ

కాంగ్రెస్​ పార్టీకి ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్​ రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత కలహాలే కారణమని తెలుస్తోంది. స్వార్థపూర్తి శక్తుల మధ్య ఉండలేకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు ఊర్మిళ.

కాంగ్రెస్​కు ప్రముఖ నటి ఊర్మిళ రాజీనామా

By

Published : Sep 10, 2019, 3:35 PM IST

Updated : Sep 30, 2019, 3:24 AM IST

కాంగ్రెస్​కు ప్రముఖ నటి ఊర్మిళ రాజీనామా

ప్రముఖ నటి ఊర్మిళా మాతోండ్కర్​ కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోని అంతర్గత కలహాలు, స్వార్థపూరిత రాజకీయాల మధ్య ఉండలేనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారామె.

హిందీ, దక్షిణ భాషల్లో అనేక చిత్రాలు చేసిన ఊర్మిళ.. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మార్చి నెలలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. లోక్​సభ ఎన్నికల్లో ఉత్తర ముంబయి నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం కాంగ్రెస్​ పార్టీలో రాజీనామల పర్వం కొనసాగింది. ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్​ గాంధీ సహా పలువురు నేతలు స్వచ్ఛందంగా పార్టీ పదవుల నుంచి తప్పుకున్నారు. మరికొందరు పార్టీకే వీడ్కోలు పలికారు.

ఇదీ చూడండి:- బోధ్​గయ పేలుడు కేసు ప్రధాన నిందితుడు అరెస్ట్​

Last Updated : Sep 30, 2019, 3:24 AM IST

ABOUT THE AUTHOR

...view details