తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సినీ ముద్దుగుమ్మలు.. వారి పరాజయ పాఠాలు

తమ జీవితంలో పరాజయాలు నేర్పిన పాఠాలు గురించి చెప్పారు పలువురు యువ కథానాయికలు. వాటిని అధిగమించి ముందుకుసాగడమే జీవితమని అంటున్నారు.

failure lessons of young heroins news
heroins

By

Published : Sep 10, 2020, 7:12 AM IST

24 కళలు చెమట చిందిస్తే సినిమా అవుతుంది.ఎన్నో కలలతో వెండితెరపై బొమ్మ పడితే అది హిట్టో ఫట్టో తెలుస్తుంది. విజయం సాధిస్తే శ్రమకు ఫలితం దక్కిందన్న సంతృప్తి మిగులుతుంది... మరి ఆశించినంతగా ఆడకుంటే? ఇంత కష్టపడితే... అలా దెబ్బకొడితే ఎలా? 8 నుంచి 12 నెలలు ఎన్నో ఇబ్బందులు భరిస్తే.. ఫెయిల్యుర్‌ ఏంటి? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి ఈ సందర్భాలను మన కథానాయికలు ఎలా తీసుకుంటారో వారి మాటల్లోనే..

ఇతరులను నిందించొద్దు...

  1. ఓటమి అంటే నాకు భయం లేదు. ఓ విధంగా మనల్ని సరిగ్గా గైడ్‌ చేసేవి పరాజయాలే. నా తొలి సినిమా ఫ్లాప్‌. ఆ సినిమాతో నేను చాలా విషయాలు నేర్చుకోగలిగా. ఎవరి కష్టాల్ని వాళ్లే దిగమింగుకుని ముందడుగు వేయాలి. మన పరాజయాలకు మరొకర్ని నిందించడంలో అర్థం లేదు. - కియారా అడ్వాణీ

అదే నా తపన..

  1. 'సవ్యసాచి', 'మిస్టర్‌ మజ్ను'తో ఈ అమ్మాయి బాగా నటించగలదనే ఓ అభిప్రాయం నాపై ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు కదా! నేనెప్పుడూ నా పాత్రకు న్యాయం చేయాలనే తపిస్తుంటా. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో బ్లాక్‌బస్టర్‌ అంటే ఎలా ఉంటుందో అనుభవంలోకి వచ్చింది. - నిధి

సమాధానం చెప్పుకోవాలి

  1. జీవితం అంటేనే పోరాటం. ప్రతిరోజు కొత్త పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. గెలుపైనా ఓటమైనా వాటిని గౌరవించాలి. ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే కష్టపడతారు. కానీ ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏం ఉండదు కదా. నా వరకైతే తొలి చిత్రంలో మహాలక్ష్మి పాత్ర కోసం ఎంత కష్టపడ్డానో... 'ఎఫ్‌2' లోని హనీ పాత్ర కోసమూ అంతే. రేపటి రోజున అద్దంలో నన్ను నేను చూసుకుంటే మనస్ఫూర్తిగా సమాధానమిచ్చుకునేలా ఉండాలనుకుంటా. నిజాయితీగా నా పని నేను చేసుకుపోతుంటా. - మెహ్రీన్‌

నచ్చింది.. చేసుకుంటూ పోవడమే!

  1. నా సినీ ప్రయాణంలో పరాజయాలు చాలానే. నాలుగు గోడల మధ్య కూర్చొని పొద్దంతా ఉద్యోగం చేయడం నాకు మొదట్నుంచీ ఇష్టం లేదు. అందుకే మా నాన్నను ఒప్పించి, నాకు నచ్చిన రంగంలోకి వచ్చా. మనకు ఇష్టమైన రంగంలో రాణించాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలెదురైనా లెక్కచేయం కదా. అలా పరాజయాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగుతున్నా. - తాప్సీ

ABOUT THE AUTHOR

...view details