ప్రేక్షకులను మరోసారి 'ఫన్'లో ముంచెత్తడానికి దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎఫ్3'. ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. క్లాప్ కొట్టారు. డిసెంబర్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
డబుల్ ఫన్‌తో 'ఎఫ్3'.. షూటింగ్ షురూ - allu aravind latest news
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో మరోసారి కనువిందు చేయనున్న హాస్యప్రధాన చిత్రం 'ఎఫ్3'. ఈ సినిమా షూటింగ్ గురువారం ప్రారంభమైంది. అల్లు అరవింద్ ప్రత్యేక అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.
ఈసారి మోర్ ఫన్‌తో 'ఎఫ్3'.. షూటింగ్ షురూ
గతేడాది సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న 'ఎఫ్2' చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'ఫన్, ఫ్రస్టేషన్, మోర్ ఫన్' అనే క్యాప్షన్‌తో ఈ సినిమా పోస్టర్‌ను ఇటీవలే విడుదల చేసింది చిత్రబృందం.