తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విమాన ప్రమాదంలో 'టార్జాన్' నటుడు మృతి - జో లారా మృతి

'టార్జాన్'( tarzan) నటుడు జో లారా(joe lara) , అతడి కుటుంబ సభ్యులు విమాన ప్రమాదంలో మరణించారు. వీరు ప్రయాణిస్తున్న బిజినెస్ జెట్​ సరస్సులో కుప్పకూలిపోవడం వల్ల అందరూ మృత్యువాతపడ్డారు.

tarzan
టార్జాన్

By

Published : May 31, 2021, 10:31 AM IST

అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు జో లారా(joe lara)తో పాటు అతడి భార్య, కుటుంబసభ్యులు మరణించారు. చిన్నపాటి బిజినెస్​ జెట్​లో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తుండగా అదికాస్తా సాంకేతిక కారణాలతో టెస్సెస్సీ​ సరస్సులో కుప్పకూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అందరూ మృత్యువాత పడ్డారు.

గాలింపు చర్యలు

జో లారా.. 'టార్జాన్' పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1980, 90వ దశకంలో ఈ టెలివిజన్ సిరీస్​ ఎంతో ప్రఖ్యాతిగాంచింది.

ABOUT THE AUTHOR

...view details