తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సముద్రం మధ్యలో సెగలు.. పూజా హొయలు - ram charan

కాస్త విరామం దొరికితే విహార యాత్రలకు వెళ్లిపోతుంటారు సినీ తారలు. ఇటీవలే మాల్దీవులకు వెళ్లిన పూజా హెగ్డే.. అక్కడ ఎంజాయ్ చేసిన క్షణాలను అభిమానులతో వీడియో రూపంలో పంచుకుంది. చాలా రొమాంటిక్​గా ఉన్న ఈ వీడియోకు ఫ్యాన్స్​ ఫిదా అయిపోతున్నారు!

pooja hegde
పూజా హెగ్డే

By

Published : Nov 25, 2021, 10:41 AM IST

మాల్దీవుల్లో సెగ పుట్టించింది ముద్దు గుమ్మ పూజా హెగ్డే. ఇటీవలే విహార యాత్రకు వెళ్లిన ఈ అమ్మడు.. సరదాగా గడిపిన క్షణాలను వీడియో రూపంలో బయటపెట్టింది. దానిని చూసిన ఫ్యాన్స్​.. ఆమె అందానికి ముగ్దులైపోతున్నారు. ప్రకృతి అందాలతో పూజా పోటీ పడుతోందని భావిస్తున్నారు.

పూజా

ఇక సముద్రం మధ్యలో బోట్​లోని బెడ్​పై పూజాహెగ్డే వాలి ఉన్న స్టిల్​ అయితే మతిపోగొట్టేలా ఉంది. దీనిని ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లో షేర్ చేసింది పూజా.

స్నోర్కెలింగ్​ చేస్తూ

సినిమాల పరంగా జోరుమీద ఉంది పూజా. యంగ్​ రెబల్ స్టార్​ ప్రభాస్​తో 'రాధే శ్యామ్'​, తమిళ సూపర్​ స్టార్ విజయ్​తో 'బీస్ట్', రామ్​ చరణ్ సరసన 'ఆచార్య'లో, హిందీలో రన్​వీర్​ సింగ్​తో 'సర్కస్'​ అనే సినిమాలో నటిస్తోంది.

పూజా హెగ్డే

ఇదీ చూడండి:Radheshyam story: ప్రభాస్​ 'రాధేశ్యామ్​' కథ లీక్​!

ABOUT THE AUTHOR

...view details