బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించింది. దిల్లీలో సుమారు ఐదు గంటలకుపైగా ఈ విచారణ కొనసాగింది. సుకేశ్ చంద్రశేఖర్ అనే ఓ వ్యక్తికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సాక్షిగా జాక్వెలిన్‌పై విచార చేపట్టారు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌పై ఈడీ విచారణ - ed jacqueline fernandez news today
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొంటోంది.
Jacqueline Fernandez
మనీలాండరింగ్ ద్వారా కోట్లాది రూపాయిలు చేతులు మార్చిన నిందితుడికి సంబంధించి ఫెర్నాండేజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు చెప్పారు. ఇప్పటికే చెన్నై సముద్ర తీరంలో ఉండే ఓ బంగ్లాను, రూ. 82.5ల నగదును, డజన్‌కు పైగా ఖరీదైన, విలాసవంతమైన కార్లను ఈటీ జప్తు చేసినట్లు పేర్కొన్నారు. సుమారు రూ. 200 కోట్లలకు పైగా ఉన్న కేసులో నేరానికి పాల్పడినట్లు తెలిపారు.
Last Updated : Aug 30, 2021, 9:39 PM IST