తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రెండో సారి పెళ్లి చేసుకున్న రాక్ - the rock

హాలీవుడ్ నటుడు, ప్రొఫెషనల్​ రెజ్లర్ డ్వేన్ జాన్సన్ పెళ్లి పీటలెక్కాడు. తన స్నేహితురాలు లోరెన్​ను వివాహం చేసుకున్నాడు. హవాయ్ దీవుల్లో ఈ జంట ఒక్కటైంది.

రాక్

By

Published : Aug 19, 2019, 9:14 PM IST

Updated : Sep 27, 2019, 2:01 PM IST

డ్వేన్ జాన్సన్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కాని 'ద రాక్' అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. డబ్ల్యూడబ్ల్యూఈ చూసేవారికి ఈ పేరు సుపరిచితమే. ఇంతకీ విషయం ఏంటంటే రాక్ ఓ ఇంటివాడయ్యాడు. చాలా ఏళ్లుగా సహజీవనం చేస్తున్న తన స్నేహితురాలు లోరెన్ హషేన్​ను సోమవారం వివాహం చేసుకున్నాడు. హవాయ్ ఈ పెళ్లి వేడుకకు వేదికైంది.

భార్య లోరెన్​తో రాక్

పదేళ్లకు పైగా కలిసి ఉన్న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి జాస్మిన్, టియానా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2006లో ద గేమ్ ప్లాన్ చిత్ర షూటింగ్​లో కలుసుకున్న జాన్సన్ - లోరెన్ అనంతరం డేటింగ్ మొదలు పెట్టారు.

డ్వేన్ జాన్సన్​ ఇంతకుముందే డ్యానీ గార్షియాను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ సంతానం. 2007లో గార్షియాకు విడాకులిచ్చాడు.

ఇది చదవండి: బీచ్​ ఒడ్డున బికినీలో రకుల్ హంగామా

Last Updated : Sep 27, 2019, 2:01 PM IST

ABOUT THE AUTHOR

...view details