Khiladi movie devi sri prasad: మాస్ మహారాజా స్టైలిష్ అవతార్‌లో నటించిన సినిమా 'ఖిలాడి'. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలు.. సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్లలోకి వస్తుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా మ్యూజిక్కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పారు దర్శకుడు రమేశ్ వర్మ.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. ఈ సినిమా కథ చెప్పిన వెంటనే ట్యూన్స్ రెడీ చేశారని రమేశ్ వర్మ చెప్పారు. మొత్తం ఆరు పాటల మ్యూజిక్ గంటలో పూర్తయిందని అన్నారు. కానీ ఇందులో ఐదింటిని మాత్రమే సినిమా కోసం ఉపయోగించామని రమేశ్ చెప్పుకొచ్చారు.