విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న 'దొరసాని' చిత్ర ట్రైలర్ విడుదలైంది. శివాత్మిక రాజశేఖర్ కథానాయిక. కేవీఆర్ మహేంద్ర దర్శకుడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
పిరియాడిక్ చిత్రంగా తెరక్కెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రం ఆకట్టుకుంటోంది. "ఉద్యమంలో చావు కూడా ఓ విజయమే.. మా ప్రేమ కూడా ఓ ఉద్యమమే" అంటూ సాగే డైలాగ్లు ఆకర్షిస్తున్నాయి. దొర కూతురుని ప్రేమించే ఓ పేదింటి కుర్రాడి ప్రేమ కథే చిత్ర కథాంశం.