తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'శ్రీదేవి అంటే ద్వేషం.. మలైకతో మాత్రం ప్రేమ' - malaika

అర్జున్ కపూర్, మలైకా అరోరాను ఉద్దేశిస్తూ ఓ మహిళ వివాదాస్పద ట్వీట్ చేసింది. "శ్రీదేవి పట్ల ద్వేషం పెంచుకున్న అర్జున్... పెళ్లై పిల్లలున్న మలైకాను ఎలా ప్రేమిస్తావు" అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది. స్పందించిన అర్జున్ తాను ఎవర్నీ దేషించట్లేదని ట్వీట్ చేశాడు.

అర్జున్ కపూర్

By

Published : May 29, 2019, 1:06 PM IST

బాలీవుడ్ నటి మలైకా అరోరా​తో ప్రేమలో ఉన్నట్టు అర్జున్ కపూర్ ఇటీవల బహిర్గతపరిచిన విషయం తెలిసిందే. తాజాగా సామాజిక మాధ్యమంలో ఓ మహిళ అర్జున్ కపూర్​పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. "శ్రీదేవిని ఇష్టపడని నువ్వు(అర్జున్)... పెళ్లై పిల్లలున్న మలైకాను ఎలా ప్రేమిస్తావ్"​ అంటూ ట్వీట్​ చేసింది.

"మీ అమ్మను వదిలేశాడన్న కారణంగా మీ నాన్న భార్యైన శ్రీదేవి అంటే నీకు ఇష్టముండదు. కానీ పెళ్లై పిల్లలు ఉండి, నీ కంటే 11 ఏళ్లు పెద్దదైన మలైకను ప్రేమిస్తున్నావ్. ఎందుకిలా రెండు తీరులుగా ప్రవర్తిస్తున్నావ్ అర్జున్" అని ఆమె ట్వీట్ చేసింది. తాను హీరో వరుణ్​ధావన్ అభిమానిని అని ట్విట్టర్​ ఫ్రొఫైల్​లో పేర్కొంది ఆమె.

బోనీ కపూర్ శ్రీదేవి కంటే ముందు అర్జున్ కపూర్ తల్లి మోనా కపూర్​ను పెళ్లి చేసుకున్నారు.

మహిళ చేసిన ట్వీట్​కు స్పందించాడు అర్జున్ కపూర్.

"నేను ఎవరి పట్ల ద్వేషాన్ని పెంచుకోలేదు. వారికి(శ్రీదేవి, బోనీకపూర్​) కొంచెం దూరంగా ఉన్నానంతే. నేను ఒకవేళ అలా చేసున్నట్లయితే మా నాన్నతో ఇన్నేళ్లు ఎలా ఉండగలను, జాన్వీ, ఖుషీ కపూర్​లతో(శ్రీదేవి కూతుర్లు) ప్రేమగా ఎలా మాట్లాడగలను. ఓ మనిషి గురించి తెలుసుకోకుండా మాట్లాడటం చాలా సులభం. నువ్వు వరుణ్​ ఫొటో పెట్టుకుని ట్విట్టర్​లో విద్వేషం వ్యాప్తి చేయొద్దు" అంటూ ఘాటు రిప్లై ఇచ్చాడు అర్జున్.

వెంటనే ఆ మహిళ తన ట్వీట్​ను తొలగించింది. క్షమించమని వేడుకొంటూ మరో పోస్ట్ చేసింది.

"ఎవరినైనా నేను బాధపెట్టుంటే క్షమించండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. అర్జున్ కపూర్​, మలైకా అరోరాకు వ్యతిరేకంగా మాట్లాడటం నా ఉద్దేశం కాదు" అంటూ ట్విట్టర్లో రాసుకొచ్చింది.

మహిళ క్షమాపణ ట్వీట్​కు హీరో వరుణ్ ధావన్ స్పందించాడు.

"క్షమాపణ చెప్పినందుకు సంతోషిస్తున్నా. అర్జున్ చాలా మంచి వ్యక్తి. అర్థం చేసుకోగలడు. నా అభిమానులు ఇతర నటులు గురించి చెడుగా మాట్లాడకూడదని నేను ఆశిస్తున్నా" అంటూ ట్వీట్ చేశాడు.

ABOUT THE AUTHOR

...view details