రవితేజ హీరోగా సైన్స్‌ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. త్వరలో స్విట్జర్లాండ్‌లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. రవితేజతో శుక్రవారం తీసుకున్న సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.
స్విట్జర్లాండ్‌లో 'డిస్కోరాజా' సందడి - payal rajput
రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'డిస్కోరాజా'. ఇప్పటికే దిల్లీ, హైదరాబాద్‌లో షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ సినిమా.. త్వరలో స్విట్జర్లాండ్‌లో షూటింగ్ జరుపుకోనుంది.
రవితేజ 'డిస్కోరాజా'
పాయల్‌తో పాటు తాన్య హోప్, నభా నటేశ్... మాస్‌మహారాజ్ సరసన నటిస్తున్నారు. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.
ఇది సంగతి: ఫ్యాషన్ ప్రపంచంలో మహేశ్ సొంత బ్రాండ్!