మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'డిస్కోరాజా'. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఆసక్తి రేకెత్తిస్తుండగా, శుక్రవారం విడుదలైన టీజర్ మరింతగా అంచనాల్ని పెంచేసింది. సినిమా విభిన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.
ఫ్రీక్ అవుట్ టీజర్‌తో అదరగొట్టిన 'డిస్కోరాజా' - raviteja movies
విభిన్న కథాంశంతో రూపొందుతున్న 'డిస్కోరాజా' టీజర్ విడుదలైంది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రం.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
డిస్కోరాజా టీజర్
ఇందులో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. తమన్ సంగీతమందించాడు. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహించాడు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఇది చదవండి: ఎన్‌కౌంటర్‌తో 'దిశ'కు న్యాయం: సినీ, క్రీడాలోకం