రెండో షెడ్యూల్ చేరిన రవితేజ 'డిస్కోరాజా' - raviteja disco raja
మాస్ మహరాజ్ రవితేజ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలు. ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.
వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ కథానాయికలు. రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా బుధవారం నుంచి రెండో షెడ్యూల్ చిత్రీకరణ షురూ కాబోతోంది. రవితేజ, ఇతర బృందంపై ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో పోరాట సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. వచ్చే నెల 21 వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరగనుంది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కీ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు.