తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'డిస్కో' కోసం రెట్రో లుక్​లో మాస్ మహారాజ్

మాస్​ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ సినిమా ఫస్ట్​లుక్​ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేసింది చిత్రబృందం. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

మాస్​ మహారాజా రవితేజ

By

Published : Sep 2, 2019, 10:46 AM IST

Updated : Sep 29, 2019, 3:48 AM IST

సైన్స్​ ఫిక్షన్​ కథతో రాబోతున్న 'డిస్కోరాజా' ఫస్ట్​లుక్​ విడుదలైంది. రెట్రో లుక్​లో తుపాకీ పట్టుకుని, కుర్చీలో కూర్చున్న రవితేజ స్టిల్​ వీక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే విభిన్న కథతో పాటు మాస్​ ఎలిమెంట్స్​, వినోదంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

నభా నటేశ్​, తాన్యా హోప్​, పాయల్​ రాజ్​పుత్​ కథానాయికలు. వి.ఐ ఆనంద్​ దర్శకత్వం వహిస్తుండగా రామ్​ తాళ్లూరి నిర్మిస్తున్నారు. బాబీ సింహ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.

'డిస్కోరాజా' ఫస్ట్​లుక్​

'డిస్కో రాజా'కు తమన్​ సంగీతం అందిస్తున్నాడు.​ డిసెంబర్​ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

ఇదీ చూడండి: సూర్య 'బందోబస్త్' కోసం విజయ్ దేవరకొండ!

Last Updated : Sep 29, 2019, 3:48 AM IST

ABOUT THE AUTHOR

...view details