తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Ram Gopal Varma on RRR: 'ఆర్‌ఆర్‌ఆర్‌'పై వర్మ షాకింగ్ కామెంట్స్​ - రామ్ చరణ్

Ram Gopal Varma on RRR: 'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా తనలోని చిన్నపిల్లాడిని బయట పెట్టిందని అన్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటివరకూ ఏది మాట్లాడిన పూర్తి స్పష్టతతో ఉండే తనకు ఈ సినిమా చూసిన తర్వాత మాటలు కరవయ్యాయని చెప్పారు.

rajamouli rrr
Ram Gopal Varma on RRR

By

Published : Mar 28, 2022, 1:16 PM IST

Updated : Mar 28, 2022, 4:41 PM IST

Ram Gopal Varma on RRR: "ఇప్పటివరకూ దేని గురించి మాట్లాడినా పూర్తి స్పష్టతతో మాట్లాడాను. కానీ, జీవితంలో మొదటిసారి మాటలు కరవయ్యాయి" అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. సినిమాలు, రాజకీయం.. ఇలా తరచూ పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టే ఆయన ఇటీవలే 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళిని మెచ్చుకున్నారు.

"'ఆర్‌ఆర్‌ఆర్‌' గురించి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. ఈ సినిమా నాలో చిన్నపిల్లాడిని బయటపెట్టింది. ఫేమస్‌, స్టేటస్‌... ఇలా అన్నీ మర్చిపోయి ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తూ సినిమా చూశా. ట్రైలర్‌ చూసినప్పుడు సినిమా బాగుంటుందని భావించాను. కానీ, సినిమా చూశాక తెలిసింది ఇదొక అద్భుతమైన చిత్రం. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మాటలు కరవయ్యాయి. నేను దేని గురించి మాట్లాడినా ఫుల్‌ క్లారిటీగా ఉంటాను. కానీ జీవితంలో మొదటిసారి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కథేంటి? పాత్రలు ఎవరు? అనే విషయాన్ని పక్కనపెడితే కథ చెప్పిన విధానం, విజువల్‌గా స్క్రీన్‌పై చూపించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. చరణ్‌ పాత్ర బాగుంది.. లేదు తారక్‌ పాత్ర చాలా బాగుంది.. అని కొంతమంది చెబుతున్నారు. ఆ రెండూ అనవసరమైన మాటలు. ఎందుకంటే, ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టేశారు. గడిచిన 30 ఏళ్లలో ఇంతలా ఏ చిత్రాన్ని నేను ఎంజాయ్ చేయలేదు. రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం. ప్రేక్షకుల కోసమే పుట్టావు. నీలాంటి వ్యక్తి ఈ భూమ్మీదకు వచ్చి.. సినిమానే కలగా చేసుకుని.. దర్శకుడిగా మంచి చిత్రాలు తెరకెక్కిస్తున్నందుకు సినీ ప్రియులందరూ ఎంతో ఆనందిస్తున్నారు" అని వర్మ తెలిపారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 28, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details