దర్శకధీరుడు రాజమౌళి తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఈ ఏడాది జూలై 30న విడుదల చేస్తామని నిర్మాతలు ఇంతకుముందే ప్రకటించారు. ఆ తేదీ మారిందంటూకొద్దిరోజుల నుంచి తెగ పుకార్లు వస్తున్నాయి. వీటిపై చిత్రబృందం స్పందించలేదు. అందువల్ల ఇవి మరింత ఎక్కువవుతున్నాయి. అయితే ఈ సినిమాను ఏకంగా సంక్రాంతికి తీసుకురానున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలి.
'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చేది సంక్రాంతికా! - అక్షయ్‌కుమార్ ఆర్ఆర్ఆర్
'ఆర్ఆర్ఆర్' సినిమా మరోసారి వాయిదా పడిందని సమాచారం. వచ్చే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతే తెలియాలంటే అధికారిక ప్రకనట వచ్చే వరకు ఆగాల్సిందే.
స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తుండటం వల్ల ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవగణ్, సముద్రఖని, అలీసన్ డూడీ, రే స్టీవెన్సన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నాడు. దానయ్య డీవీవీ.. సుమారు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి: ఈసారైనా పూరీ-చిరు సినిమా మొదలవుతుందా?