తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఏజెంట్​ ఆత్రేయకు దర్శకేంద్రుడి ప్రశంసలు - naveen polishetty

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రబృందాన్ని దర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అభినందించారు. మంచి సినిమా తీశారని ప్రశంసించారు.

రాఘవేంద్రరావు

By

Published : Jun 28, 2019, 9:16 PM IST

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శుక్ర‌వారం విడుద‌లైన న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌`. ప్రేక్షకులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ అందుకుంటోంది. తాజాగా ఈ సినిమాను చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు, హీరో న‌వీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా, ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ స‌హా ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ చిత్రబృందంతో దర్శకేంద్రుడు

అద్భుత‌మైన సినిమా చేశారంటూ చిత్రబృందాన్ని కొనియాడారు ద‌ర్శ‌కేంద్రుడు. సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను యూనిట్‌తో ముచ్చ‌టించారు.
న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి స్వ‌రూప్ ద‌ర్శకత్వం వహించాడు.

ఇవీ చూడండి.. సాయిపల్లవితో కమ్ముల మరోసారి ఫిదా చేస్తాడా?

ABOUT THE AUTHOR

...view details