తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది' - raghavendra

రాఘవేంద్రరావు తెలుగు సినీ చరిత్రలో తిరుగులేని దర్శకుడు. ఆనాటి తారల నుంచి నేటి తారల వరకు అందరితో కలిసి పనిచేసిన ఘనత ఆయనది. తాజాగా ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో ఆయనకు నచ్చిన, నచ్చని రెండు సినిమాల పేర్లు చెప్పారు. అవేంటో తెలుసుకుందాం.

raghavendra
raghavendraరాఘవేంద్రరావు

By

Published : Feb 22, 2020, 1:18 PM IST

Updated : Mar 2, 2020, 4:21 AM IST

టాలీవుడ్‌ అగ్ర దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. అలనాటి అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం నటులందరితోనూ పనిచేశారాయన. నటీనటులంతా ఆయన సినిమాల్లో కనిపిస్తే చాలు అనుకునేంత ప్రతిభ చూపారు. ముఖ్యంగా నాయికలు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటిస్తే అదో క్రేజ్‌ అనుకుంటారు. ఆయన హీరోయిన్లపై వేసే పళ్లే దానికి కారణం. 1975లో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ఈయన ఇప్పటికీ అదే పంథా కొనసాగిస్తున్నారు. మరి ఇలాంటి దర్శకుడికి నచ్చిన, నచ్చని సినిమాలేంటో తెలుసా?

నచ్చిన చిత్రం: 'భాగ్‌ మిల్కా భాగ్‌'. ఇది ఆయన చేసుంటే బాగుండు అనిపించిందట.

ఈ చిత్రం చేయకుండా ఉండాల్సిందని అనిపించిన చిత్రం: 'మాస్టర్‌జీ'. ఇది రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిందీ చిత్రం. తమిళ సినిమా ‘ముందనై ముడిచు’కి రీమేక్‌.

రాజేష్‌ ఖన్నా, శ్రీదేవి నాయకానాయికలు. ఈ సినిమాలో రాజేష్‌ ఖన్నాను సరిగా చూపించలేదని, దాంతో ఆయన క్రేజ్‌ కాస్త తగ్గిందని, అందుకే ఈ సినిమా తీయకుండాల్సిందనుకున్నారట.

ఇదీ చూడండి : జాతీయ ఉత్తమ నటుడి సినిమాపై అరబ్ దేశాల్లో నిషేధం

Last Updated : Mar 2, 2020, 4:21 AM IST

ABOUT THE AUTHOR

...view details