టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ త్వరలో పెద్ద ప్రాజెక్టుతో రానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇందుకు సంబంధించి విజువల్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్, రచయితలు కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చింది నిర్మాణ సంస్థ.
"మేం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాం. విజువల్ ఆర్టిస్ట్స్, డిజైనర్స్, రచయితలు ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలంటే సంబంధిత చిరునామాకు వివరాలు తెలియజేయాలి" -ట్విట్టర్లో వైజయంతీ మూవీస్ సంస్థ