టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) సోషల్‌మీడియాకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. చివరిగా తన మనసులోని ఈ మాటను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకొని.. డిజిటల్ మాధ్యమాలకు గుడ్‌బై చెప్పారు.
"ఇప్పటి వరకు ఎన్నో విషయాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా మీతో పంచుకున్నా. వాటి నుంచి తప్పుకొనే సమయం ఆసన్నమైంది. మన మీడియా మిత్రుల ద్వారా మీతో ఎప్పుడూ టచ్‌లో ఉంటా. మాధ్యమం మారుతుంది కానీ మన అనుబంధం కాదు."
- కొరటాల శివ, దర్శకుడు
కొరటాల శివ.. తన చిత్రాలకు సంబంధించిన విషయాల్నే కాకుండా వివిధ అంశాలపైనా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తుండేవారు. ప్రస్తుతం ఆయన చిరంజీవి కథానాయకుడిగా 'ఆచార్య'(Acharya) రూపొందిస్తున్నారు. కాజల్(Kajal) కథానాయిక. రామ్ చరణ్ (Ram Charan), పూజా హెగ్డే(Pooja Hegde) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్(NTR)తో కలిసి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
ఇదీ చూడండి..నటనకు గుడ్‌బై.. వ్యాపారంలోకి అడుగుపెట్టనున్న తార?