తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో 'ప్రేమదేశం' సీక్వెల్.. అభిమానుల్లో జోష్! - Abbas Cutting

'ప్రేమదేశం'(Prema Desam Movie).. అప్పట్లో యువతను బాగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపును తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు కదిర్(Prema Desam movie Director)​. ప్రస్తుతం స్క్పిప్ట్​ వర్క్​ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు.

Premadesam2
ప్రేమదేశం 2

By

Published : Sep 15, 2021, 2:18 PM IST

'ప్రేమ దేశం'.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో సెన్సేషన్. అప్పట్లో యువతను బాగా ఆకర్షించిన చిత్రమిది. డ్రెస్సింగ్​ స్టైల్, హెయిర్​ స్టైల్​ నుంచి నడవడిక వరకు పూర్తిగా యువత ఈ సినిమానే ఫాలో అయ్యారంటే 'ప్రేమదేశం'కు(Prema Desam Movie) ఉన్న క్రేజ్​ ఎలాంటిదో అర్థమవుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు కదిర్​.. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్​ తీసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం పూర్తి స్క్రిప్ట్​ కూడా రాసినట్లు తెలిపారు కదిర్​(Prema Desam Movie Director). ఈ విషయాన్ని ట్వీట్​ చేశారు. "ప్రేమదేశం 2 స్క్రిప్ట్​ రాయడం ఎంతో ఉత్సాహం, ఆసక్తిగా ఉంది" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.
అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించిన ప్రేమదేశం.. హీరో వినీత్​, అబ్బాస్​లకు(Abbas Actor Movies) ఓవర్​నైట్​ స్టార్​డమ్​ను తెచ్చిపెట్టింది. టబు(Tabu Actress) నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రేమ విషయంలో యువతను బాగా ప్రభావితం చేసింది. 1996లో తమిళంలో 'కాదల్ దేశం'(Kadhal Desam Movie), తెలుగులో 'ప్రేమదేశం'గా.. విడుదలైంది ఈ చిత్రం.
కథాంశం..
ఈ సినిమాలో ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో.. స్నేహానికి అంతే ప్రాముఖ్యత ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని ప్రేమించినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షణలు, సంఘటనలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. 90ల్లో వచ్చిన ఈ మూవీ కళాశాల స్నేహానికి అద్దం పట్టింది. కాలేజీ స్నేహం ఎప్పటికీ అంతం కానిది అంటూ చాటి చెప్పింది.

ఇప్పటికీ తగ్గని 'ముస్తఫా' క్రేజ్..'ముస్తఫా.. ముస్తఫా'(Mustafa Mustafa), 'ప్రేమా..' ఈ పాటలకు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమదేశంలోని ఈ పాటలు ఇప్పటికీ కుర్రోళ్ల నోటివెంట, కాలేజీ ఫంక్షన్స్​లో ప్రదర్శితమవుతుంటాయి. 'కాలేజీ స్టైలే..', 'హలో డాక్టర్​ హార్ట్​ మిస్సాయే' పాటలు కూడా బాగా హిట్​ అయ్యాయి. యువత ఈ సినిమాను మరింత ఆదరించేలా చేశాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్​ రెహమాన్​ ఈ సినిమాలో పాటలు పాడటం విశేషం.
అబ్బాస్​ కటింగ్..యువత సెలూన్​కు వెళ్తే.. 'అబ్బాస్​ కటింగ్​'(Abbas Cutting) అనే మాట మాత్రమే వినిపించేదంటే నాడు ఆ సినిమా ప్రభావం కుర్రకారులో ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 'ప్రేమదేశం'లో అబ్బాస్​ కటింగ్​కు కూడా ఇంత ఫేమ్​ సంపాదించిందంటే అది డైరెక్టర్​ గొప్పతనమనే చెప్పాలి. డైలాగ్స్​..ప్రేమదేశం సినిమా గొప్పతనం కథాంశంలో మాత్రమే లేదు. ఆ సినిమాలో ఉండే ప్రతీ డైలాగ్​ ఓ ఆణిముత్యం. 'ఒక గుడిలో ఎంతమంది దేవుళ్లైనా ఉండొచ్చు.. కానీ, ఆడదాని గుండెలో ఇద్దరు మగాళ్లుండకూడదు' లాంటి డైలాగ్​లు సినిమా స్థాయిని మరింత పెంచాయి.

ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్​ వస్తుందన్న వార్త అభిమానుల్లో జోష్​ను నింపింది. అయితే.. ఈ సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details