తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలయ్య, పవన్​కల్యాణ్​లకు నేను అభిమానిని' - క్రాక్​ సినిమాలో హీరో రవితేజ

లాక్​డౌన్​తో పాటు భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడిన దర్శకుడు గోపీచంద్ మలినేని.. 'క్రాక్' సినిమా కబుర్లను వెల్లడించారు.

'నేను బాలయ్య, పవన్​కల్యాణ్​కు అభిమానిని'
దర్శకుడు గోపీచంద్ మలినేని

By

Published : Jun 14, 2020, 6:55 AM IST

ఆయన.. మొదటి ప్రయత్నంలోనే రవితేజను 'డాన్‌ శీను'గా మార్చారు. మాస్‌ మహారాజ్‌ 'బలుపు' చూపించి దుమ్మురేపారు. ముచ్చటగా మూడోసారి రవితేజ 'క్రాక్‌' చూపించేందుకు రెడీ అయిపోయారు దర్శకుడు మలినేని గోపీచంద్‌. దీనితో పాటు లాక్‌డౌన్‌, భవిష్యత్తు ప్రణాళికలపై 'ఈనాడు సినిమా'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

లాక్‌డౌన్‌ పరిస్థితిలో ఎలా అనిపించింది?

ఈ తరం 70రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఖాళీగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. నేను మామూలుగానే ఎక్కువ మందిని కలిసేవాణ్ని కాదు. షూటింగ్‌ ఉంటే షూటింగ్‌కు వెళ్లడం, లేకుంటే ఇంటి దగ్గరే ఉండటం. అందుకే ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నా నాకు కొత్తగా అనిపించలేదు. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపా. చూడని సినిమాలు చూశా. రెండు స్క్రిప్ట్‌ల మీద పనిచేశా.

దర్శకుడు గోపీచంద్ మలినేని

రవితేజతో మూడో సినిమా కదా! ప్రేక్షకులకు ఎటువంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు?

'డాన్‌ శీను', 'బలుపు' ఎంటర్‌టైన్‌మెంట్‌ కోణంలో సాగుతాయి. 'క్రాక్‌' తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న కమర్షియల్‌ చిత్రం. ఓ పోలీస్‌ అధికారి విభిన్న సంఘటనలను ఎలా ఎదుర్కొన్నాడనేదే సినిమా. అవి చూడగానే ప్రేక్షకుడికి 'అవును... ఇలా జరిగింది కదా' అన్న ఆలోచన తడుతుంది. రవితేజ నుంచి అభిమానులు ఆశించేవి అన్నీ ఉంటాయి.

మిగిలిన చిత్రీకరణ ఎప్పుడు?

షూటింగ్‌ 10 నుంచి 15 రోజుల్లో పూర్తవుతుంది. ఓ పాట, చిన్న చిన్న షాట్లు చిత్రీకరించాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతులకు అనుగుణంగా జులై మొదటి, రెండో వారాల్లో షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ సినిమాకు పనిచేసే వారు కొంతమంది చెన్నై, ముంబయి, కర్ణాటకలో ఉన్నారు. వారంతా ఇక్కడకొచ్చి స్వీయ నిర్బంధంలో ఉండాలి. ఆ తరువాతే షూటింగ్‌.

'క్రాక్‌'ను ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఏమైనా ఉందా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో స్పష్టంగా చెప్పలేకపోతున్నాం. నాకు తెలిసి ఆగస్టు నుంచి అనుమతులు లభించొచ్చు. ఇప్పుడిప్పుడే జనాలు బయటకు రావడం మొదలుపెట్టారు. 'క్రాక్‌' మాస్‌ సినిమా. జనాల మధ్య కూర్చొని పెద్ద తెర మీద చూసే చిత్రం. కరోనా భయం ఉన్నా థియేటర్లలోకి జనాలు వస్తారన్న నమ్మకం ఉంది. ఇంట్లో ఉండి పనిచేసినా సరే... వారంలో ఒక్కరోజైనా బయటకు వెళ్లాలని ఎవరికైనా అనిపిస్తుంది. అలాంటి వారికి ఆప్షన్‌ ఈ సినిమానే.

క్రాక్​ సినిమాలో హీరో రవితేజ

క్రాక్‌ తరువాత..

నేను పవన్‌ కల్యాణ్‌, బాలయ్యలకు అభిమానిని. వారితో సినిమా చేయాలని ఎప్పుడూ ఉంటుంది. ప్రస్తుతం ఓ పెద్ద హీరో కోసం కథ సిద్ధం చేశా. మరో 15 రోజుల్లో ఆయనకు వినిపిస్తా.

క్వారంటైన్‌లో శ్రుతిహాసన్‌

రవితేజతో షూటింగ్‌ చేయడం అంటే నాకు చాలా సౌకర్యంగా ఉంటుంది. శ్రుతిహాసన్‌ మంచి నటి. నేను ఆమెతో 'బలుపు' చేశాను. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో చాలా మెచ్యురిటీ వచ్చింది. శ్రుతి లాక్‌డౌన్‌ ఎత్తేశాకా ముంబయి నుంచి హైదరాబాద్‌కు షూటింగ్‌ కోసం కార్లో వచ్చేసింది. ఇక్కడే ఓ ఇల్లు తీసుకొని స్వీయ నిర్బంధంలో ఉంటోంది. పని పట్ల ఆమె అంకితభావం అలాంటిది.

ABOUT THE AUTHOR

...view details