తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరు, బాలకృష్ణలతో దర్శకుడు అనిల్ రావిపూడి

మెగాస్టార్​ను దర్శకత్వం వహించాలనేది తన చిరకాల కోరిక అని, లాక్​డౌన్ ముగిసిన వెంటనే ఆయనకు కథ వినిపిస్తానని చెప్పారు దర్శకుడు అనిల్ రావిపూడి.

By

Published : May 3, 2020, 11:57 AM IST

Directior Anil Ravipudi says my dream is to work with Megastar Chiranjeevi
త్వరలో యంగ్​ డైరెక్టర్​తో చిరంజీవి సినిమా!

మెగాస్టార్​ చిరంజీవితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నారు 'ఎఫ్​2', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాల డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇటీవలే జరిగిన ఓ టీవీ లైవ్ చాట్​లో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నారు. ఇప్పటికే చిరు కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

"మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలన్నది నా కల. ఆయన కోసం ఇప్పటికే ఓ కథ రాస్తున్నా. లాక్​డౌన్​ పూర్తయిన వెంటనే వెళ్లి కథ వినిపిస్తా. నా ప్రాజెక్టును ఆయన ఓకే చేస్తారని భావిస్తున్నాను. దీనితో పాటే నందమూరి బాలకృష్ణ కోసమూ ఓ స్టోరీ అనుకుంటున్నా"

-అనిల్​ రావిపూడి, దర్శకుడు

ప్రస్తుతం అనిల్.. 'ఎఫ్3' సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' చేస్తున్న చిరు.. ఆ తర్వాత వరుసగా డైరెక్టర్లు సుజీత్, బాబీ, మెహర్ రమేశ్​లతో కలిసి పనిచేయనున్నారు.

ఇదీ చూడండి : యువ దర్శకుడికి అవకాశమిచ్చిన బాలకృష్ణ!

ABOUT THE AUTHOR

...view details