తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అడివి శేష్​కు దిల్​రాజు బంపర్ ఆఫర్ - నవీన్​ చంద్ర

'ఎవరు'తో ప్రశంసలు అందుకున్న హీరో అడివి శేష్​ను.. తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేయమని ఆహ్వానించారు నిర్మాత దిల్​రాజు.

అడివి శేష్

By

Published : Aug 16, 2019, 6:29 PM IST

Updated : Sep 27, 2019, 5:15 AM IST

అడివి శేష్​కు దిల్​రాజు బంపర్ ఆఫర్

థ్రిల్లర్ చిత్రాలతో వరుస హిట్​లు కొడుతున్న కథానాయకుడు అడివి శేష్​కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తర్వాత సినిమాను తన సంస్థలో చేయాలని ఆహ్వానించారు.

శేష్ నటించిన "ఎవరు" పంపిణీదారుడిగా వ్యవహరించిన దిల్ రాజు.. బాక్సాఫీస్ వద్ద ఆ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. సినీ నేపథ్యం లేకపోయినా ప్రతిభతో హిట్ కొట్టొచ్చని శేష్ నిరూపించాడని ప్రశంసించారు.

దిల్ రాజు నిర్మించిన "ఎవడు" చిత్రంలో కొద్దిలో అవకాశాన్ని చేజార్చుకున్న శేష్.. మళ్లీ ఆ అవకాశాన్ని "ఎవరు" తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ నటుడు 'మేజర్​' సినిమా​లో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ హీరో మహేశ్​బాబు నిర్మాత.

ఇది చదవండి: 'ఎవరు' సినిమా విజయ రహస్యం అదే....

Last Updated : Sep 27, 2019, 5:15 AM IST

ABOUT THE AUTHOR

...view details