తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరోయిన్​తో నిర్మాత దిల్​రాజు కోట్ల రూపాయల డీల్! - విజయ్ వంశీ పైడిపల్లి మూవీ

తన నిర్మాణంలో రాబోయే మూడు భారీ సినిమాల కోసం నిర్మాత దిల్​రాజు(dil raju movies) పక్కా ప్లాన్ వేశారట. వీటిలో హీరోయిన్​గా ఒకే భామను ఎంపికే చేసి, ఆమెతో కోట్ల రూపాయల డీల్​ కుదుర్చుకున్నారట.

Dil Raju Offers Multi-Crore Deal To Kiara Advani?
దిల్​రాజు

By

Published : Oct 1, 2021, 9:15 AM IST

నిర్మాత దిల్​రాజు దూకుడు మీద ఉన్నారు. భారీ బడ్జెట్​ సినిమాలను వరుసగా ప్రకటిస్తూ, పాన్ ఇండియా స్థాయిలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిలో రామ్​చరణ్-శంకర్(ram charan new movie), విజయ్-వంశీ పైడిపల్లి(vijay thalapathy) చిత్రాలు ఇందులో ఉన్నాయి.

.

అయితే అల్లు అరవింద్(allu aravind age) బాటలో దిల్​రాజు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఓ హీరోయిన్​తో వరుసగా మూడు సినిమాలు చేసేందుకు మల్టీ మిలియన్ డీల్ కుదుర్చుకుంటున్నారు! అల్లు అరవింద్ పూజా హెగ్డేను(pooja hegde movies) ఎంపిక చేసినట్లు, దిల్​రాజు.. కియారా అడ్వాణీతో(kiara advani movies) డీల్​ కుదుర్చుకున్నారట!

రామ్​చరణ్-శంకర్​ సినిమాలో ఈమెనే హీరోయిన్​గా చేస్తోంది. ఇప్పుడు విజయ్-వంశీ పైడిపల్లి ప్రాజెక్టులో కియారా హీరోయిన్​గా నటించడం ఖాయంగా కనిపిస్తోంది.

కియారా అడ్వాణీ

నిర్మాత దిల్​రాజుతో డీల్​కుగానూ కియారాకు దాదాపు రూ.12 కోట్లు అందనున్నాయట. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.

భరత్ అను నేను, వినయ విధేయ రామ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు అలరించిన కియారా.. ఎన్టీఆర్​-త్రివిక్రమ్(ntr trivikram movie)​ చిత్రంలోనూ హీరోయిన్​గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి.

.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details