పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'పింక్' రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఈ సినిమా కోసం కేవలం 30 రోజులే కాల్ షీట్లు ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్ పరిసరాల్లో ప్రతిరోజూ చిత్రీకరణ ఉన్న నేపథ్యంలో సమయాభావాన్ని తగ్గించేందుకు పవన్‌కు ప్రత్యేక విమాన సదుపాయం కల్పించారట. ఇప్పటికే ఓ విమానయాన సంస్థతో నిర్మాత దిల్‌రాజు ఒప్పందం చేసుకున్నారని సమాచారం. అందుకోసం దాదాపు రూ.కోటి ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
ఫొటోల లీక్‌పై జనసేనాని ఆగ్రహం