బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నదిలీప్ కుమార్ సాల్వాడీ నటిస్తూ తెరకెక్కించిన చిత్రం 'దిక్సూచి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. డివోషన్ల్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్న కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
'దేవుడంటే భక్తి కాదు.. భయం' - release
క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన దిక్సూచి సినిమా వేసవి కానుకగా ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
1970ల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్లు ప్రచార చిత్రం చూస్తే తెలుస్తోంది. 'దేవుడనే వాడే లేడు.. అసలిది భక్తి కాదు..భయం' అంటూ సాగే సంభాషణలతో ప్రేక్షకులలో ఆసక్తి కలిగిస్తోంది. శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న అస్థిపంజరం సన్నివేశంతో సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది ప్రచార చిత్రం.
1993 నుంచి దాదాపు 25 చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు దిలీప్ సాల్వాడీ. ధర్మచక్రం, పోకిరి రాజా, స్నేహం కోసం, బావగారు బాగున్నారా, అన్నయ్య, జయం లాంటి విజయవంతమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం దిక్సూచి చిత్రంలో నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నాడు.