చంద్రయాన్-2 వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్ గురించి భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) ఇంకా వెతుకుతూనే ఉంది. తాజాగా హాలీవుడ్ హీరో బ్రాడ్‌పిట్ విక్రమ్‌పై ఆరా తీశాడు. "ల్యాండర్‌ను చూశారా" అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న అమెరికా వ్యోమగామిని వీడియో కాన్ఫరెన్స్‌లో అడిగాడు.
అమెరికాలోని నాసా ప్రధాన కార్యాలయానికి వెళ్లిన బ్రాడ్‌పిట్ ఐఎస్ఎస్ వ్యోమగామి నిక్ హేగ్‌తో 20 నిమిషాల పాటు మాట్లాడాడు. అంతరిక్షంలోని పరిస్థితుల గురించి అతడిని పలు ప్రశ్నలు అడిగాడు. ఇందులో భాగంగా భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగమైన విక్రమ్ ల్యాండర్ గురించి ప్రస్తావించాడు.