తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కంగన చిత్రంలో సాయి పల్లవిని గుర్తుపట్టారా?

దక్షిణాదిలో పలుభాషల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాందించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. అంతకుముందు బాలనటిగానూ పలు చిత్రాల్లో నటించింది. అందులోని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

సాయి
సాయి

By

Published : Jun 7, 2020, 5:55 PM IST

తొలి తెలుగు చిత్రం 'ఫిదా'తోనే అందరి మనసులు దోచిన భామ సాయిపల్లవి. అనంతంర 'ఎంసీఏ', 'కణం', 'పడిపడి లేచెమనసు' సినిమాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. బాలనటిగా పలు పాత్రల్లో నటించింది. మలయాళ హిట్‌ 'ప్రేమమ్‌'లో అరంగేట్రం చేయకముందు తమిళ చిత్రాలు 'కస్తూరి మాన్‌', 'ధామ్‌ ధూమ్‌'లో చిన్న పాత్రల్లో కనిపించింది.

జయం రవి, కంగనా రనౌత్‌, రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ధామ్‌ ధూమ్‌'. జీవా దర్శకుడు. 2008లో విడుదలైంది. ఇందులో కంగన కజిన్‌గా సాయిపల్లవి నటించింది. అయితే ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 'ధామ్‌ ధూమ్‌'లో సాయిపల్లవికి సంబంధించిన సన్నివేశం వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. ఈ సినిమా గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిందీ భామ.

"అవును 'ధామ్‌ ధూమ్‌'లో నటించా. కానీ అది నా కెరీర్‌ ఆరంభ సినిమాగా భావించడం లేదు. ఎందుకంటే.. అప్పుడు ఏం చేస్తున్నాను, ఎలా నటిస్తున్నాననే విషయం కూడా తెలియదు. అప్పుడు ఆరో తరగతి చదువుతున్నా. క్లాస్‌లు ఎగ్గొట్టాలని స్నేహితులతో కలిసి బయటికి వెళ్లా. అలా రెండు రోజులు షూటింగ్‌లో పాల్గొన్నా. అప్పట్లో షూటింగ్‌ అంటే అసౌకర్యంగా ఫీలయ్యాను. ఇంత ఎండలో, ఒకే సన్నివేశాన్ని మళ్లీ మళ్లీ రిపీట్‌ చేస్తూ ఎలా తీస్తారబ్బా అనుకున్నా. కథానాయిక కాస్ట్యూమ్స్‌, మేకప్‌, హెయిర్‌.. ఇవన్నీ భరించడం చాలా కష్టం అని ఫీలయ్యా"

-సాయి పల్లవి, హీరోయిన్

సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య సరసన 'లవ్‌ స్టోరీ' చిత్రం చేస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details