తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వైవాహిక బంధానికి దియా గుడ్​బై - దియామీర్జా

బాలీవుడ్ నటి దియా మీర్జా తన భర్త సాహిల్​ సాంగ్​ నుంచి విడిపోతున్నట్లు గురువారం వెల్లడించింది. వైవాహిక బంధానికి సెలవు పలుకుతున్నట్లు పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా ఓ సందేశాన్ని పంచుకుందీ భామ.

దియా మీర్జా, సాహిల్​ సాంగ్​

By

Published : Aug 1, 2019, 2:54 PM IST

వైవాహిక బంధానికి వీడ్కోలు పలికింది బాలీవుడ్​ హీరోయిన్​ దియామీర్జా. ఆమె భర్త సాహిల్​ సింగ్ తో 11 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు... సామాజిక మాధ్యమాల వేదికగా గురువారం స్పష్టం చేసింది. విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతామని, ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉంటుందని వెల్లడించిందీ 37 ఏళ్ల అమ్మడు. దాదాపు 6 సంవత్సరాల ప్రేమాయణం తర్వాత 2014 నవంబర్​లో సాహిల్​​ను పెళ్లి చేసుకుంది దియా.

'ఇద్దరం 11 ఏళ్ల జీవితాన్ని పంచుకున్నాం. ఇప్పుడు ఏకాభిప్రాయంతో విడిపోవాలనుకుంటున్నాం. మా వివాహ బంధానికి ముగింపు పలికినా ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. ఒకరికొకరు ప్రేమ, గౌరవం ఇచ్చుకోవడంలో ఎలాంటి మార్పు ఉండదు. మా ప్రయాణాలు మమ్మల్ని వేర్వేరు దారుల్లో నడిపించినా.. ఎప్పటికీ అభిమానంగానే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకున్న మా కుటుంబాలకు, స్నేహితులకు ధన్యవాదాలు. ఇప్పట్నుంచి ఈ విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నా. ఇంకెప్పుడూ ఈ అంశంపై ఇద్దరం మాట్లాడం".
-దియా మీర్జా, బాలీవుడ్​ నటి

ఇటీవలే 'కాఫీర్' అనే వెబ్-సిరీస్​లో కనిపించింది దియా. గతంలో సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' లో మానాయత్ దత్ పాత్ర పోషించింది.

ఇది సంగతి: భారతీయుడు 2 చిత్రంలో పాల్గొననున్న కమల్!

ABOUT THE AUTHOR

...view details