శరీరాకృతి గురించి ఎందరో హీరోయిన్లు హేళనకు గురవుతుంటారు. అలా హేళనకు గురైన బాలీవుడ్ నటి... విద్యాబాలన్. బొద్దుగా ఉన్నందుకు తన శరీరాన్ని చూసి తానే బాధపడేదాన్ననే విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించిందీ నటి. ఇటువంటి అవమానాలు ఎదుర్కొనే వారికి సాయం చేసేందుకు విద్య.. ప్రముఖ రేడియో స్టేషన్ బిగ్ ఎఫ్‌ఎంతో కలిసి 'ధున్ బదల్ కే దేఖో' అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.
విద్య 'ధున్ బదల్ కే దేఖో' వీడియో సాంగ్ - bollywood
ఇతరుల శరీరాకృతిని, రూపును చూసి వెక్కిరించొద్దని అంటోంది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఇటువంటి అవమానాలు ఎదుర్కొనే వారి కోసం 'ధున్ బదల్ కే దేఖో' అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతోందీ బాలీవుడ్ నటి.
విద్య
ఈ కార్యక్రమం ఉద్దేశాన్ని వివరిస్తూ ఓ వీడియో రూపొందించింది విద్య. ఇతరుల శరీరాకృతి, రూపును చూసి వెక్కిరించొద్దని పాట పాడుతూ విద్య కన్నీరుపెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇవీ చూడండి.. ఇద్దరిపై అత్యాచారం... మూడో యువతి ఎక్కడ?