అకీవ్ అలి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, టబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దే దే ప్యార్‌దే’. ఈ సినిమాలో ‘హౌలీ హౌలీ’ అంటూ సాగే మూడో పాటను శుక్రవారం విడుదల చేశారు. అజయ్‌తో కలిసి టబు, రకుల్ పోటీపడి చిందులేశారు.
పోటీపడి చిందులేసిన రకుల్, టబు - rakul preet
‘దే దే ప్యార్ దే’ చిత్రం నుంచి ‘హౌలీ హౌలీ..’ అనే మరో వీడియో సాంగ్ విడుదలైంది. ఈ పాటలో అజయ్ దేవగణ్‌తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్, టబు చిందులేశారు.
పోటీపడి చిందులేసిన రకుల్, టబు
కథేంటి...?
50 ఏళ్ల ఆశిష్ (అజయ్) తన భార్య మంజు (టబు)తో విడిపోయి ఒంటరిగా ఉంటాడు. అప్పుడే అతడికి 26 ఏళ్ల ఆయేషా (రకుల్)తో పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా మారి.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న మంజు మళ్లీ ఆశిష్ జీవితంలోకి వస్తుంది. అలా మాజీ భార్య, ప్రేయసి మధ్య ఆశిష్ ఎలా ఇరుక్కున్నాడు అన్నదే కథ. రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మే 17న ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.