తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాన్​ఝనా' కాంబినేషన్ మరోసారి..! - dhanush

బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు సిద్ధమని తమిళ నటుడు ధనుష్ తెలిపాడు.

ధనుష్

By

Published : Jun 4, 2019, 8:13 PM IST

Updated : Jun 5, 2019, 12:22 AM IST

బాలీవుడ్​లో​ ధనుష్ హీరోగా పరిచయమైన చిత్రం 'రాన్​ఝనా'. ఆనంద్ ఎల్​ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దక్షిణాదిన పలు విజయవంతమైన సినిమాలు చేశాక ఈ హీరో 2013లో బాలీవుడ్​ తెరకు పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో సోనమ్ కపూర్ హీరోయిన్​గా నటించింది.

"మరోసారి ఆనంద్​ ఎల్ రాయ్​తో కలిసి పనిచేయబోతున్నా. అది ఎప్పుడన్నదీ చెప్పలేను. మంచి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నా".
ధనుష్, తమిళ నటుడు

ప్రస్తుతం ధనుష్ ఓ హాలీవుడ్ సినిమాలో నటించాడు. 'ద ఎక్​స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ద ఫకీర్'​గా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి కెన్ స్కాట్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 21న విడుదలవనుంది.

ఇవీ చూడండి.. వికారాబాద్​లో రవితేజ 'డిస్కో రాజా' షూటింగ్

Last Updated : Jun 5, 2019, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details