'రోబో', 'సర్కార్', 'పేట' వంటి హిట్ సినిమాలను రూపొందించి చిత్ర నిర్మాణంలో ప్రత్యేకత చాటుకుంది 'సన్ పిక్చర్స్' సంస్థ. తమిళ అగ్ర నటులు రజనీకాంత్, విజయ్, విక్రమ్‌లతో చిత్రాలు నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు ధనుష్‌తో ఓ మూవీ తెరకెక్కించబోతుంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అధికారకంగా ప్రకటించిందీ సంస్థ.
సన్ పిక్చర్స్ నిర్మాణంలో 'ధనుష్ 44' - dhanush 44
తమిళ నటుడు ధనుష్ కొత్త చిత్రం తెలిసిపోయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌లో తన 44వ సినిమాను చేయనున్నాడీ హీరో.
ధనుష్
"ధనుష్ 44వ చిత్రాన్ని మా నిర్మాణ సంస్థలో రూపొందిస్తున్నామని తెలియజేయడం సంతోషంగా ఉంది"అని ట్వీట్ చేశారు ఈ సంస్థ నిర్మాత కళానిధి మారన్. దర్శకుడు, కథానాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఇవీ చూడండి.. 'శుభ్ మంగళ్ జ్యాదా సావధాన్' షూటింగ్ పూర్తి