తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నిర్మాణాంతర పనుల్లో "దేవినేని" చిత్రం

‘దేవినేని’ చిత్రానికి సంబంధించి నిర్మాణాంతర పనులు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దేవినేని పాత్రలో నందమూరి తారకరత్న, వంగవీటి రంగా పాత్రలో కొండేటి సురేశ్​ నటిస్తున్ననారు. శనివారం వంగవీటి రంగా జయంతి సందర్భంగా... చిత్రానికి సంబంధించిన స్టిల్స్​ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

devineni movie shooting completed
నిర్మాణాంతర పనుల్లో "దేవినేని" చిత్రం

By

Published : Jul 5, 2020, 12:55 AM IST

Updated : Jul 5, 2020, 1:06 AM IST

శివనాగేశ్వరరావు దర్శకత్వంలో జీఎంఎన్​ ఫిల్స్మ్​, ఆర్​టీఆర్​ ఫిల్మ్స్​ సంయుక్తంగా.... జీఎస్​ఆర్​ చౌదరి, రామూరాఠోడ్​ నిర్మించిన "దేవినేని" చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రసాద్​ ల్యాబ్​లో మిక్సింగ్​ పనులు జరుగుతున్నాయి. విజయవాడలో దేవినేని నెహ్రూ, రంగాల మధ్య ఏం జరిగింది... వారిద్దరి మధ్య ఘర్షణ... దాని పర్యావసానాలు ఇతివృత్తంగా ఈ చిత్రాన్ని తీసినట్లు దర్శకుడు శివనాగు తెలిపారు.

ఈ చిత్రంలో వంగవీటి రంగా పాత్రలో నటిస్తున్న కొండేటి సురేశ్​ నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కోటి బాణీలను అందిస్తున్నారు. చిత్రాన్ని త్వరలోనే థియేటర్లోనే విడుదల చేస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:ప్రియాంక 20 ఏళ్ల కెరీర్​ ఏడున్నర నిమిషాల వీడియోలో

Last Updated : Jul 5, 2020, 1:06 AM IST

ABOUT THE AUTHOR

...view details