'సీటీమార్' పాట బాలీవుడ్ సినీప్రియుల్ని ఉర్రూతలూగిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన 'దువ్వాడ జగన్నాథం' చిత్రంలోని ఈ సాంగ్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడీ పాటనే సల్మాన్ ఖాన్ కోరిక మేరకు 'రాధే' సినిమాలో రీమిక్స్ చేశారు దేవిశ్రీ. దీంతో ఇప్పుడు దేవిశ్రీకి హిందీలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలోనే దర్శకుడు రోహిత్ శెట్టి నుంచి దేవిశ్రీప్రసాద్‌కు పిలుపు అందిందని సమాచారం. రోహిత్ ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్‌తో 'సర్కస్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, జాక్వెలైన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. త్వరలో చిత్రీకరణ మొదలవుతుంది. ఇప్పుడీ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఓ ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేస్తున్నారట.