తెలంగాణ

telangana

ETV Bharat / sitara

స్టార్​ హీరోల నటనా గురువు ఇకలేరు - నాజర్

చిరంజీవి, రజనీకాంత్​ వంటి ప్రముఖ హీరోలకు నటనలో ఓనమాలు నేర్పిన దేవదాస్​ కనకాల.. హైదరాబాద్​లో శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

దేవదాస్​ కనకాల మృతి

By

Published : Aug 2, 2019, 5:45 PM IST

Updated : Aug 2, 2019, 6:15 PM IST

ప్రముఖ నటుడు, దర్శకుడు, నట గురువు దేవదాస్ కనకాల మృతి చెందారు. ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్​ కొండాపూర్​లోని కిమ్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. రాజీవ్‌ కనకాల తండ్రే ఈయన. ప్రముఖ టీవీ యాంకర్​ సుమ కనకాల ఈయనకు కోడలు.

వృద్ధాప్యంలో దేవదాస్​ కనకాల

స్టార్​ హీరోలకు గురువుగా ప్రాముఖ్యత

తొలుత సినిమాల్లోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన దేవదాస్ కనకాల.. ఆ తర్వాత నటనా శిక్షణ ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. ఇప్పుడున్న ఎందరో స్టార్ హీరోలు, సూపర్​స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటకిరీటీ రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, నాజర్, భాను చందర్, అరుణ్ పాండ్యన్, రాంకీ, రఘవరన్​ ఈయన వద్దే నటనా ఓనమాలు నేర్చుకున్నారు.

వ్యక్తిగత సమాచారం

యుక్త వయుసులో దేవదాస్ కనకాల

1945 జూలై 30న యానాంలోని కనకాలపేటలో పుట్టిన దేవదాస్​.. ఎనిమిది మంది తోబుట్టువులలో పెద్దవాడు. ఆంధ్ర యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్​లో పట్టా పొందారు. అనంతరం సాంగ్​ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్​లో నటుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.

ఈయన సతీమణి లక్ష్మీదేవి కనకాల. కుమారుడు రాజీవ్ కనకాల(నటుడు). కూతురు శ్రీలక్ష్మీ కనకాల.

విభిన్న ప్రతిభావంతులు

సినిమాలు, సీరియల్స్​లో నటుడిగా రాణించారు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యనభ్యసించిన తొలితరం నటుడు దేవదాస్‌ కనకాల. ఓ సీత కథ, సిరిసిరి మువ్వ, చెట్టు కింద ప్లీడర్, గోరింటాకు తదితర సినిమాల్లో సహాయ పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఆయన నటించిన చివరి చిత్రం 'భరత్​ అను నేను'. చలిచీమలు చిత్రంతో దర్శకుడిగానూ ఆకట్టుకున్నారు.

నటుడిగా దేవదాస్​ కనకాల

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఆంధ్రప్రదేశ్​ అనే నటనా శిక్షణాలయాన్ని స్థాపించి ఎందరో నటీనటులను తీర్చిదిద్దారు.

Last Updated : Aug 2, 2019, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details