తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కరోనాను తరిమికొట్టేందుకు సూపర్​హీరో అవుతా' - మోడల్ డెమీ రోజ్​

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సూపర్​హీరోగా అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది నటి డెమీ రోజ్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుందీ భామ.

'కరోనాను తరిమికొట్టేందుకు సూపర్​హీరో అవుతా'
నటి డెమీ రోజ్

By

Published : Apr 3, 2020, 11:07 AM IST

ఇంగ్లీష్ మోడల్ డెమీ రోజ్​.. సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు సూపర్​హీరో అవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది.

లాక్​డౌన్​ సందర్భంగా పలుదేశాల్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. డెమీ రోజ్​ మాత్రం ఎప్పటికప్పుడు ఇన్​స్టా వేదికగా అభిమానులకు దగ్గరగా ఉంటోంది. ఈ సందర్భంగా ఫై వ్యాఖ్యలు చేసింది.

" ప్రస్తుతం లాక్​డౌన్​ అమల్లో ఉండటం వల్ల చాలా విసుగ్గా ఉంది. ఈ కరోనాను ఎదురించేందుకు సూపర్ హీరో అవ్వాలని ఉంది"

-- డెమీ రోజ్, మోడల్

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో బోర్ కొట్టకుండా సన్నీ సరికొత్త చాట్ షో

ABOUT THE AUTHOR

...view details