తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భారత్​' నిలుపుదల కుదరదు: దిల్లీ హైకోర్టు

సల్మాన్​ ఖాన్ నటించిన భారత్​ చిత్రం విడుదలపై స్టే విధించాలన్న వ్యాజ్యాన్ని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దేశం పేరునే చిత్రానికి పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​ను విచారించిన కోర్టు చిత్రం ద్వారా ఉచిత ప్రచారాన్ని పొందేందుకు పిటిషనర్ ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.

'భారత్​' నిలుపుదల కుదరదు: దిల్లీ హైకోర్టు

By

Published : Jun 3, 2019, 10:28 PM IST

జూన్ 5న విడుదల కావాల్సిన సల్మాన్​ఖాన్​ చిత్రం భారత్​ విడుదలపై స్టే విధించాలన్న పిటిషన్​ను తిరస్కరించింది దిల్లీ హైకోర్టు. దేశం పేరునే చిత్రానికి పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ పిటిషనర్​ దాఖలు చేసిన పిటిషన్​ను కోర్టు విచారించింది. జూన్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రంపై పిటిషన్​ వేయడం ఉచిత ప్రచారం కోసమేనని వ్యాఖ్యానించింది.

వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించకమునుపే మీడియాకు విడుదల చేయడంపై పిటిషనర్ వికాస్​ త్యాగిని మందలించింది.

స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ప్రస్తుత పరిస్థితుల వరకూ కథాంశంగా తీసుకుని సల్మాన్​ఖాన్ కథానాయకుడిగా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ భారత్​ చిత్రాన్ని తెరకెక్కించారు.

పిటిషనర్​ వాదనలివే

పేర్లు, చిహ్నాల దుర్వినియోగం చట్టం కింద చిత్రానికి భారత్​ అని నామకరణం చేయడం సరికాదని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

"ఘనమైన మన దేశ పేరును ఓ పాత్రకు, సినిమాకు పెట్టడం సరికాదని భావిస్తున్నాను. మన సంప్రదాయం, రాజకీయ ముఖచిత్రాన్ని వక్రీకరించారు"

-వ్యాజ్యంలో పిటిషనర్

చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్, నిర్మాణ సంస్థలు రియల్ లైఫ్ ప్రొడక్షన్స్, సల్మాన్​ ఖాన్ ఫిల్మ్స్ , కథానాయకుడు సల్మాన్​ ఖాన్​కు, కేంద్ర చిత్ర ధ్రువీకరణ సంస్థకు భారత్​ చిత్రంపై సూచనలు చేయాలని పిటిషనర్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. చిత్రంలోని కథానాయకుడి పాత్రను దేశంతో పోల్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: యుద్ధం ప్రారంభించిన 'ఆర్మీ మేజర్​ మహేశ్'

ABOUT THE AUTHOR

...view details