తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దీపిక బోల్డ్ సీన్స్.. భర్త రణ్​వీర్ రియాక్షన్ ఏంటి? - deepika prabhas movie

Deepika gehraiyaan: కొత్త సినిమాలో దీపిక చెలరేగిపోయింది. బోల్డ్​ సీన్స్​తో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అయితే వీటిని చూసి ఆమె భర్త ఏమన్నారో తెలుసా?

Deepika Ranveer singh
దీపిక రణ్​వీర్ సింగ్

By

Published : Jan 27, 2022, 10:00 AM IST

Deepika ranveer movies: 'గెహ్రాహియా' ట్రైలర్, పాటలు​ ఈ మధ్య రిలీజయ్యాయి. ఇందులో దీపికా పదుకొణె బోల్డ్​ సీన్స్ చేయడం చూసి చాలామంది ప్రేక్షకులు షాకయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్​లో, ఇలాంటి సన్నివేశాల నటిస్తుందా? ఆమె భర్త, హీరో రణ్​వీర్ సింగ్ అసలు ఎలా ఫీలవుతున్నాడు? ఇబ్బంది ఏం రాలేదా? అని చాలామందికి సందేహాలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు వీటన్నింటికీ దీపికనే స్వయంగా సమాధానమిచ్చింది. ఈ సినిమాలోని తన సీన్స్​పై రణ్​వీర్ రియాక్షన్ గురించి కూడా దీపిక చెప్పింది.

'గెహ్రాహియా' సినిమాలోని సీన్స్

"ట్రైలర్​ చూసి చాలా బాగా ఎంజాయ్ చేశాడు. సినిమా చూసేందుకు ఆసక్తితో ఎదురుచూస్తున్నాడు" అని భర్త రణ్​వీర్ గురించి దీపిక చెప్పింది.

రొమాన్స్, మోడ్రన్ రిలేషన్​షిప్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 11న అమెజాన్ ప్రైమ్​లో నేరుగా విడుదల కానుంది. ఇందులో దీపికతో పాటు సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే కీలకపాత్రలు పోషించారు. షకున్ బత్రా దర్శకత్వం వహించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details