తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జేజమ్మ పాత్రలో దీపికా పదుకొణె..!

అనుష్క హీరోయిన్​గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సినిమా 'అరుంధతి'. ఈ చిత్రం బాలీవుడ్​లో రీమేక్​ కాబోతుంది. అయితే ఇందులో కథానాయికగా దీపికా పదుకొణెను ఎంపిక చేసినట్లు సమాచారం.

దీపికా

By

Published : Nov 4, 2019, 8:40 AM IST

2009లో ఒక దర్శక దిగ్గజం భారీ బడ్జెట్‌తో, అత్యున్నత స్థాయి సాంకేతిక విలువలతో గ్రాఫిక్స్‌ మయాజాలంగా రూపొందించిన థ్రిల్లర్‌ చిత్రం 'అరుంధతి'. పైగా ఇందులో కథానాయకుడు లేడు. అప్పటికి ఆమె అగ్ర కథానాయిక కూడా కాదు.

కానీ కథ మీద నమ్మకంతో దర్శకుడు కోడి రామకృష్ణ అనుష్క కథానాయికగా 'అరుంధతి' సినిమా రూపొందించి పెద్ద సాహసమే చేశారు. ఆ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. రికార్డులు తిరగరాస్తూ వసూళ్లు సాధించిన ఈ చిత్రం హిందీలో రీమేక్‌లో అవబోతుంది. అయితే ఇప్పటి వరకు అనుష్క పాత్రను ఏ బాలీవుడ్‌ భామ పోషిస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటికే అనుష్క శర్మ, కరీనా కపూర్‌ పేర్లు వినపడగా తాజాగా ఈ జాబితాలోకి దీపికా పదుకొణె చేరింది.

దీపిక

ఈ చిత్రంలో దీపిక నటించబోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం దీపిక యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న 'ఛపాక్‌' చిత్రంలో నటిస్తోంది. '83' సినిమాలో రణవీర్‌కు జోడిగానూ కనిపించనుంది.

ఇవీ చూడండి.. నాజూకు అందాల మతాబు.. టబు..!

ABOUT THE AUTHOR

...view details