విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా.. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగులో అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కాలేజీ, క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇటీవలే ఈ సినిమాను ఓ ప్రముఖ సంస్థ హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. నెట్టింట విడుదలైన 24గంటల్లో 12 మిలియన్ల వీక్షణలు సొంతం చేసుకుంది. సమయం గడుస్తున్న కొద్ది వ్యూస్ పెంచుకుంటూ రికార్డు దిశగా సాగుతోంది.
హిందీలో రికార్డు సృష్టిస్తోన్న 'డియర్ కామ్రేడ్' - భరత్ కమ్మ
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోకపోయినా.. హిందీ డబ్బింగ్ వర్షెన్తో యూట్యూబ్‌లో విడుదలై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
హిందీలో రికార్డు సృష్టిస్తున్న 'డియర్ కామ్రేడ్'
ఇదీ చూడండి.. 'సామజవరగమన..' పాటకు కేటీఆర్ ఫిదా
Last Updated : Feb 17, 2020, 9:30 PM IST